![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -47 లో.... వేళంపాటలో జానూ వాళ్ళ ఇంటిని కాపాడుకోవడానికి నందు నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని వస్తుంది. వేళం ఆపండి అని చెప్తుంది. వేళం ఆగాలంటే కోర్ట్ నుంచి స్టే తీసుకొని రావాలి అప్పుడే వేళం ఆగుతుందని మేనేజర్ చెప్తాడు. లాయర్ ఆల్రెడీ స్టే ఆర్డర్ తీసుకొని వస్తున్నాడని జానూ చెప్తుంది. లాయర్ వచ్చే కార్ ట్రబుల్ ఇస్తుంది. ఏ వెహికల్ అటువైపుగా రాకుండా సింహాద్రి మనుషులు ఉంటారు.
లాయర్ ని తీసుకొని రావడానికి సూర్య, జానూ వెళ్తారు. లాయర్ ని తీసుకొని వస్తుంటే రౌడీలు రాంగ్ రూట్ కి డైవర్షన్ పెడతారు. దాంతో అడవిలోకి వెళ్తారు. వాళ్ళ ముందే ఒక ఆటో డైవర్షన్ వస్తుంది అందులో ఒకావిడ పురిటినొప్పులతో బాధపడుతుంటే జానూ తనకి సాయంగా ఉంటుంది. ఇక లాయర్ ని వేళం దగ్గరికి తీసుకెళ్ళమని సూర్యని పంపిస్తుంది. వాళ్ళు ఎలాగైనా వేళం దగ్గరికి రాకుండా చెయ్యాలని సింహాద్రి అడుగడుగనా అడ్డుపడుతాడు. మరొకవైపు పురిటి నొప్పులు పడుతుంటే అక్కడ వెళ్లేందుకు దారి లేకపోవడంతో జానూ ప్రసవం చెయ్యడానికి అన్ని సిద్ధం చేస్తుంది.
మరొకవైపు వేళంలో అందరు సింహాద్రి మనుషులుంటారు. ఒక్కొక్కరుగా వేళం పాడుతుంటే అప్పుడే ఒకతను ఎంట్రీ ఇస్తాడు నా పేరు దొరబాబు అని చెప్పి వేళం పాట పాడుతాడు. మీ అక్క జానూ పంపించింది. వాళ్ళు వచ్చేవరకు నన్ను పాట పాడమని ఎక్కడ వేళం ఆగకుండా చూసుకోమని చెప్పిందని నందు తో దొరబాబు చెప్తాడు. తరువాయి భాగంలో వేళం పాట దొరబాబు ఎక్కువగా పాడుతాడు. అయినా ఇంకా సూర్య వాళ్ళు రాకపోయేసరికి అందరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |